Telangana: సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభం

Telangana: సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభం
X

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల శివారుల్లో వ్యవసాయ కళాశాల ప్రారంభం అయ్యింది. ప్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన కళాశాలను స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సుమారు 35 ఎకరాల్లో 69 కోట్ల 30లక్షల రూపాయలతో కళాశాల నిర్మాణం చేపట్టారు. 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్దతిలో కళాశాల భవనం నిర్మించారు.విద్యార్ధిని, విద్యార్థులకు వేర్వురుగా హాస్టల్ భవనాలు నిర్మించారు. ఇక 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఏర్పాటు చేశారు.

తెలంగాణలో వ్యవసాయన్ని పండగలా చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాలువలు, చెరువుల ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. అనవసర విమర్శలు చేసే వారిని తాము పట్టించుకోబోమన్నారు. ఇక వ్యవసాయ కళాశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్న కేటీఆర్.. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేస్తామన్నారు.

Tags

Next Story