AP : కల్లు తాగిన కోతిలా హరీష్‌రావు మాట్లాడుతున్నాడు : మంత్రి అప్పలరాజు

AP : కల్లు తాగిన కోతిలా హరీష్‌రావు మాట్లాడుతున్నాడు : మంత్రి అప్పలరాజు

సీఎం కేసీఆర్‌ కుటుంబంపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు నోరు పారేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం, మంత్రుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్‌రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తానూ ఓ మంత్రి అన్న సంగతి మర్చిపోయి చాలా దారుణంగా.. నీచాతి నీచంగా నోటి దూలతో రెచ్చిపోయారు. కేసీఆర్‌తో కలిసి హరీష్‌రావు ఫామ్‌హౌస్‌లో కల్లు తాగాడా అని అనిపిస్తుందని ఏకవచనంతో విమర్శలు గుప్పించారు. కల్లు తాగిన కోతిలా ఒళ్లు కొవ్వెక్కి హరీష్‌రావు మాట్లాడుతున్నాడని ఓరేంజ్‌లో రెచ్చిపోయారు. మీ మామ లాగా.. ఫామ్‌హౌస్‌లో కూర్చొని మేము కల్లు తాగడం లేదన్నారు. కవితలాగా.. మా దగ్గర చాట్లు కూడా లేవని.. మీలాగా లిక్కర్ స్కామ్‌ లేవని హాట్ కామెంట్స్ చేశారు. మాట్లాడే ముందు హరీష్‌రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

బంగారు తెలంగాణ అన్నారు.. దొరల పాలనలో ఏంజరుగుతోందని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. నువ్వు మంత్రి... మీ మామ మంత్రి, ఆయన కొడుకు ఒక మంత్రి అంటూ రెచ్చిపోయిన అప్పలరాజు.. తెలంగాణ ఏమన్నా మీ జాగీరా అని ప్రశ్నించారు. మీరు, మీ మామ, మీమామ కొడుకు, కూతురు, మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన మాటలు ఆపి మీ పని మీరు చేసుకోండని చెప్పారు. మా ఆంధ్రావాళ్లు తెలంగాణ రావడం మానేస్తే అక్కడ ఏమి ఉండదని.. అడుక్కు తినడం తప్ప అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ వాళ్లు బుర్ర తక్కువ వాళ్లు అంటూ నోరుపారేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story