ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌ హాస్యాస్పదం : సుఖేష్‌ చంద్రశేఖర్‌

ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌ హాస్యాస్పదం : సుఖేష్‌ చంద్రశేఖర్‌

జైల్లో నుంచి సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖ విడుదల చేశాడు. తాను చేసిన ఆరోపణలకు ఎమ్మెల్సీ కవిత రియాక్షన్‌ హాస్యాస్పదమంటూ కౌంటర్‌ వేశాడు. తనకు తెలుగు, తమిళం మాట్లాడటం వచ్చన్న సుఖేష్‌.. కవిత పేరును గౌరవప్రదంగా కవితక్క అని మొబైల్‌లో ఫీడ్‌ చేసుకున్నా అని చెప్పాడు. కవితక్క పేరుతో ఫీడ్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్లను వెల్లడించాడు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే దర్యాప్తు సంస్థల విచారణకు కవిత సిద్ధపడాలని సవాల్‌ చేశాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానన్న సుఖేష్‌.. క్లీన్‌ ఇమేజ్‌తో ఎన్నికల్లో పోటీ చేయాలన్నదే తన ఉద్దేశమన్నాడు. అందుకే గతంలో జరిగిన విషయాలు సమాజానికి తెలియజేయాలని ప్రకటనలు విడుదల చేస్తున్నట్లు చెప్పాడు.

Tags

Next Story