ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్‌పై విచారణ

ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్‌పై విచారణ
హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విచారణ చేపట్టనుంది

ఇవాళ ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్సింగ్‌పై విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం విచారణ చేపట్టనుంది. జగిత్యాల JNTU ప్రాంగణంలో ఈసీ ప్రతినిధులు విచారించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, నాటి ధర్మపురి అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్‌ హాజరు కావాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ నోటీసులు జారీ చేసారు.

తాళాలు లేక స్ట్రాంగ్ రూమ్ తెరవకపోవడంపై ఈనెల 12న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వీఆర్‌కే కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన విషయాలను రాతపూర్వకంగా కోర్టుకు నివేదించారు. తాళాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాళాలు మాయమవడంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

Tags

Next Story