ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు నేడే పగలగొట్టేది

జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఇవాళ అధికారులు పగులగొట్టనున్నారు. స్ట్రాంగ్ రూమ్ కీస్ మిస్ కావడంతో తాళాలను బ్రేక్ చేయాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటలకు తాళాలను అధికారులు పగులగొట్టనున్నారు. కాగా స్ట్రాంగ్ రూమ్ లోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా నివేదించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీఆర్కే కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ తాళాలను జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా, అధికారుల సమక్షంలో అధికారులు బ్రేక్ చేయనున్నారు. 268 ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ లో 17 సీ డాక్యుమెంట్ కీలకం కానుంది. గత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com