నా కోరిక తీరింది.. పదవి పోతుందనే రేవంత్ కన్నీళ్లు: బండి సంజయ్

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌కి ప్రతి ఒక్కరు రావాలన్న కోరిక నెరవేరిందన్నారు. ఇక పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని,కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుందని అన్నారు. 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని ఈటల ఎక్కడా అనలేదని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే అన్నారన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బీఆర్‌ఎస్ ఆర్ధిక సాయం చేస్తుందన్న బండి సంజయ్ బీఆర్‌ఎస్ దేశంలోని పార్టీలకు ఆర్ధిక సాయం చేస్తుందని రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా అన్నారని దానికి ఫ్రూఫ్‌లు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు తీసుకుంది వాస్తవమని మునుగోడులో ఇదే ప్రచారం జరిగిందని అన్నారు. మరోవైపు గ్యాంగ్‌స్టర్ అతీక్ మరణానికి MIM సంతాప సభలు పెట్టడం ఏంటని? ప్రశ్నించారు. తెలంగాణకు బీఆర్‌ఎస్,ఎంఐఎం పార్టీలు అవసరమా అంటూ సెటైర్ వేశారు బండి సంజయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com