ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్ధి అనుమానస్పద మృతి

ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్ధి అనుమానస్పద మృతి
X

ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్ధి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు యాదాద్రి- భువన గిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగాలగూడెంకు చెందిన మనికాంత్ గా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితం ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన మనికాంత్‌ చెట్ల పొదల్లో శవమై కనిపించాడని, స్థానికుల సమాచారం అందించారు. దాంతో మనికాంత్‌ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగి పోయారు. మనికాంత్ మృత దేహాన్ని త్వరగా ఇండియా చేరేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

Next Story