దేశాన్ని అల్లకల్లోలం చేసేలా బీజేపీ కుట్ర: భట్టి

దేశాన్ని అల్లకల్లోలం చేసేలా బీజేపీ కుట్ర: భట్టి
X
చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు బాధాకరమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు బాధాకరమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన.. కేంద్రంపై మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని అల్లకల్లోలం చేసేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జనగణన చేయకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌.. బీజేపీకి లొంగిపోయిందని దుయ్యబట్టారు.

Tags

Next Story