కక్షగట్టి అరెస్ట్‌ చేశారు.. సహనం నశించే పోలీసులను తోసేశా: షర్మిల

కక్షగట్టి అరెస్ట్‌ చేశారు.. సహనం నశించే పోలీసులను తోసేశా: షర్మిల
X
ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్పా తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్పా తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన షర్మిల.. కక్షగట్టే తనను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేశారని అన్నారు. తాను ఎవరి మీద చేయి చేసుకోలేదని.. పోలీసులు కావాలనే కొన్ని సెలెక్ట్‌ వీడియోలు బయటపెట్టారని ఆరోపించారు. సహనం నశించే పోలీసులను తోసేశానని చెప్పారు.

Tags

Next Story