ట్యాంక్‌బండ్‌లో అదుపుతప్పిన బోట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ట్యాంక్‌బండ్‌లో అదుపుతప్పిన బోట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
బలమైన ఈదురుగాలుల వీయడంతో అదుపుతప్పి బోటు కొట్టుకుపోయింది

హైదరాబాద్‌ నగరంలో కురుస్తోన్న భారీ వర్షానికి ట్యాంక్‌బండ్‌లో టూరిస్ట్‌ బోటు అదుపుతప్పి కొట్టుకుపోయింది. మంగళవారం 40 మంది పర్యాటకులతో ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వద్దకు బోటు బయల్దేరింది. ఈ క్రమంలో బుద్ధ విగ్రహం వరకు చేరుకునేలోపే బలమైన ఈదురుగాలుల వీయడంతో అదుపుతప్పి బోటు కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది స్పీడ్‌ బోట్‌ల ద్వారా పర్యాటకులను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాస్తలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Tags

Next Story