సమ్మెబాట పట్టిన ఆర్టిజన్లకు షాక్‌.. ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు

సమ్మెబాట పట్టిన ఆర్టిజన్లకు షాక్‌.. ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
సమ్మెలో పాల్గొన్న 200మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జరీ

సమ్మెబాట పట్టిన ఆర్టిజన్లకు విద్యుత్ సంస్థలు షాక్‌ ఇచ్చాయి. సమ్మెలో పాల్గొన్న 200మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జరీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 4 విద్యుత్‌ సంస్థల పరిధిలో 20వేల 500 మంది వరకూ ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. జీతాలు మరింత పెంచాలంటూ కొంత మంది సమ్మెలో పాల్గొన్నారు. అయితే ఇందులో 80 శాతానికి పైగా విధులకు హాజరయ్యారు. జెన్‌కోలో వంద శాతం ఆర్టిజన్లు విధులకు వచ్చారని.. ట్రాన్స్‌కో, రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలలో 80 శాతం మంది హాజరైనట్లు జెన్‌కో-ట్రాన్స్‌కో ప్రకటించింది. విద్యుత్‌ సంస్థల్లో సమ్మెలను 6 నెలల పాటు నిషేధిస్తూ అత్యవసర సర్వీసుల చట్టం కింద గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. సర్వీసు నిబంధన ప్రకారం సమ్మె చేయడం దుష్ప్రవర్తన కిందకు వస్తుందని.. ముందుగానే ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. సమ్మె నేపథ్యంలో ప్రజలకు నిరంతర విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story