సీఎం కేసీఆర్‌ తొలి సంథకం దానిపైనే?

సీఎం కేసీఆర్‌ తొలి సంథకం దానిపైనే?
నూతన సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం ఏ ఫైల్‌పై చేయబోతున్నారు? ఏదైనా కొత్త సంక్షేమ పథకం ఫైలుపై సంతకం పెడతారా?

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వంసిద్ధమైంది. బీఆర్కే భవన్ నుంచి శాఖల తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈనెల 30న సీఎం కేసీఆర్.. నూతన సచివాలయం ప్రారంభించబోతున్నారు. దాదాపు ఆరున్నరేళ్లు తర్వాత సెక్రటేరియట్‌లో గులాబీ బాస్ అడుగుపెట్టబోతున్నారు. అయితే నూతన సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం ఏ ఫైల్‌పై చేయబోతున్నారు? ఏదైనా కొత్త సంక్షేమ పథకం ఫైలుపై సంతకం పెడతారా? లేక నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ఫైల్‌పై తొలి సంతకం చేస్తారా? అసలు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వేళ కేసీఆర్.. న్యూ సెక్రటేరియట్‌ నుంచి తొలి పాలనా ముద్ర ఎలా ఉండబోతుంది? గులాబీ అధినేత అనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా దళితబంధు రెండో విడత అమలు మార్గదర్శకాల ఫైలుపై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు.. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలు చేయాల్సిన ఇంకా కొన్ని కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల్సి ఉందని గులాబీ బాస్ ప్రకటించారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సభల్లోనూ మంత్రి కేటీఆర్.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారని, తెలంగాణలో మరికొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పారు. దాంతో సీఎం కేసీఆర్.. ఏదైనా కొత్త సంక్షేమ పథకం ప్రకటన ఫైలుపై తొలి సంతకం చేసే అవకాశముందని గులాబీ వర్గాలు అంటున్నాయి.

దళితబంధు రెండో విడత, పోడు హక్కు పట్టాల పంపిణీ, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల సాయం మార్గదర్శకాల ఫైళ్లు కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు ఫైళ్లు కాకుండా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరేదైనా కొత్త సంక్షేమ పథకం దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story