Nara Lokesh : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువగళంలో ప్రజలు

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా లో జోరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకుసాగుతున్నారు. మరోవైపు వర్షం కురుస్తున్నా లోకేష్‌ని చూసేందుకు మాచాపురం గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వ ర్షంలో తడుస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న నారా లోకేష్.. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ వారికి భరోసా క ల్పిస్తున్నారు. మాచాపురం శివార్లలో కుండపోత వర్షం కురుస్తున్నా గొడుగును సైతం తిరస్కరించారు లోకేష్. ఇక ప్రజలు, అభిమానులు.. జై టీడీ పీ, జై చంద్రబాబు నినాదాలతో హెరెత్తిస్తున్నారు.
యువనేత నారా లోకేష్‌ను మాచాపురం, నడకైరవాడ గ్రామస్తులు కలిశారు. స్వార్థపూరిత ఆలోచనల కారణంగా కొందరు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని లోకేష్‌కు చెప్పుకున్నారు. ప్రస్తుతం స్థలాలు లేక తాత్కాలిక రేకుల షెడ్లు వేసుకొని జీవనం సాగిస్తున్నట్లు లోకేష్‌కు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే నడకైరవాడి, మాచాపురం గ్రామాల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాచాపురం గ్రామస్తులు కోరిన విధంగా శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. చిలకలడోన లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ సమస్యను పరిష్కరించి సజావుగా నీరందేలా చేస్తామన్నారు. ఎస్సీ కాలనీతోపాటు గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు నారా లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com