భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయం

హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలిపెట్టడం లేదు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. ఎల్బీగనర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్, సైదాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.. అఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. ఎల్బీనగర్ చింతలకుంట అండర్ పాస్‌పై భారీగా వరద నీరు చేరింది.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. మోకాళ్లలోతు నీళ్లలోనే వాహనాలు వెళ్తున్నాయి.. అటు భారీ వర్షానికి సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ నీటమునిగింది. కాలనీలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. పీవీ ఎక్స్ ప్రెస్ వే కింద భారీగా వరద నీరు చేరింది.
భారీ వర్షాలకు హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో రహదారి కుంగిపోయింది.. అయితే, ఆ సమయంలో జనం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు కుంగిన విషయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో హుటాహుటిన డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.. రోడ్డు కుంగిపోవడంతో సైదాబాద్, సంతోష్‌నగర్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గాజుల రామారంలో 3.8, హయత్ నగర, చంద్రయాణ గుట్టలో 2.9, మల్కాజ్‌గిరిలో 2.8, ఫలక్‌నుమాలో 2.3, ఆల్వాల్‌లో 2, ఎల్బీనగర్‌లో 1.8, కార్వాన్‌లో 1.3, శివరాంపల్లిలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com