బీజేపీలోకి పొంగులేటి.. దాదాపు ఖాయమంటున్న కాశాయ నేతలు

బీజేపీలోకి పొంగులేటి.. దాదాపు ఖాయమంటున్న కాశాయ నేతలు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ వచ్చిందంటోంది కాషాయ పార్టీ

ఇవాళ ఖమ్మంలో బీజేపీ చేరికల కమిటీ సమావేశం కానుంది . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ వచ్చిందంటోంది కాషాయ పార్టీ. పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ సీనియర్‌ నేతలు ఈటల, రఘునందన్‌, రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఖమ్మంలో సమావేశం కానున్నారు. మరోవైపు బహిరంగ సభ ఏర్పాటు చేసి పొంగులేటి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ బహిరంగ సభకు అగ్రనేతలు హాజరయ్యే అవకాశం కూడా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. కర్ణాటక ఎన్నికల‌ తర్వాత ఖమ్మం సభ ద్వారా బీజేపీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్‌ చేసిందని అంటున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లికి కూడా కాషాయ కండువా కప్పే ఛాన్స్‌ ఉందని వెల్లడిస్తున్నారు.

Tags

Next Story