పొంగులేటి వద్దకు ఈటల వెళ్లడం నాకు తెలియదు.. బండి కీలక వ్యాఖ్యలు

పొంగులేటి వద్దకు ఈటల వెళ్లడం నాకు తెలియదు.. బండి కీలక వ్యాఖ్యలు
తన దగ్గర ఫోన్‌ లేదన్న బండి సంజయ్... అందుకే తనకు ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు

బీజేపీలో పొంగులేటి చేరికపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి దగ్గరికి ఈటల వెళ్లారనే తనకు తెలియదన్నారు. తన దగ్గర ఫోన్‌ లేదన్న బండి సంజయ్... అందుకే తనకు ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. కానీ.. తనకు చెప్పకపోవడం తప్పేం కాదన్న ఆయన.. పొంగులేటి వస్తే ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణలో రాక్షసరాజ్యంపై పోరాటానికి ఎవరినైనా కలుపుకుపోతామన్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారన్న సంజయ్‌.. తనకు తెలిసినవారితో తాను మాట్లాడతా అన్నారు. ఈటలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారు.. తప్పేం లేదన్నారు సంజయ్.

Tags

Next Story