Bajrang Dal : తెలంగాణకు పాకిన భజరంగ్‌దళ్ వివాదం

Bajrang Dal : తెలంగాణకు పాకిన భజరంగ్‌దళ్ వివాదం
X

కర్నాటకలో మొదలైన బజరంగ్‌దళ్ వివాదం తెలంగాణకు పాకింది. కర్నాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసుల ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. శాంతియుత వాతావరణంలో.. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కేడర్‌కు సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపుమేరకు హనుమాన్ చాలీసా పారాయణానికి సిద్ధమయ్యారు బీజేపీ నేతలు.

Tags

Next Story