Nizamabad : బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

Nizamabad : బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణ కోసం కాంగ్రెస్ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరారు బీజేపీ నేతలు. దీంతో బీజేపీ నేతల్ని పోలీసులు అడ్డుకోగా తోపులాట చోటుచేసుకుంది. రోడ్డుపై బైటాయించిన బీజేపీ నేతలు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో జిల్లా బీజేపీ నేతలతోపాటు వంద మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు.

వివాదం కర్ణాటకలో మొదలైంది..!
కర్నాటకలో మొదలైన బజరంగ్‌దళ్ వివాదం తెలంగాణకు పాకింది. కర్నాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసుల ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. అధ్యక్షుడి పిలుపుమేరకు హనుమాన్ చాలీసా పారాయణానికి సిద్ధమయ్యారు బీజేపీ నేతలు.

Tags

Next Story