తెలంగాణపై జాతీయ పార్టీల నజర్‌

తెలంగాణపై జాతీయ పార్టీల నజర్‌
X
తెలంగాణపై జాతీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. అన్ని పార్టీల చూపు తెలంగాణ వైపే ఉంది

తెలంగాణపై జాతీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. అన్ని పార్టీల చూపు తెలంగాణ వైపే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, బీఎస్పీ చీఫ్‌ మాయావతి పర్యటించారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారు. అటు.. ఈనెల 14న కరీంనగర్‌లో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ టూర్ ఉంది. హిందు ఏక్తా యాత్రలో ఆయన పాల్గొననున్నారు. అటు.. ఈనెల 27న మరోసారి అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నారు. యోగా దినోత్సవం సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియడంతో.. అన్ని పార్టీల ముఖ్య నేతలు తెలంగాణ వైపు చూస్తున్నారు. దీంతో రాజకీయం ఇక్కడ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Tags

Next Story