యువ సంఘర్షణ సభకు సర్వం సిద్ధం

యువ సంఘర్షణ సభకు సర్వం సిద్ధం
ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం

తెలంగాణ కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం హైదరాబాద్‌ సరూర్‌ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ గర్జించనుంది. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలికేలా పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జనాన్ని సమీకరిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. యూత్ డిక్లరేషన్‌లో ఫస్ట్ ప్రియారిటిగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు పత్రం ఇవ్వనున్నారు. అదే విధంగా అమరుల కుటుంబాలకు ప్రతినెలా 25 వేల పెన్షన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించనున్నారు ప్రియాంకగాంధీ. ఇక బిశ్వాల్ కమిటీ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయనునట్లు ప్రకటిస్తారు. ప్రతిఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు ప్రతినెలా 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థుల పూర్తి ఫీజుల చెల్లింపు లాంటి అంశాలు యూత్‌ డిక్లరేషన్‌లో ఉన్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.

Tags

Next Story