కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్‌

కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్‌
ఎన్నికలు దగ్గర పడటంతో రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని విమర్శించారు దేశాన్ని 50 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌ పాలించిందని.. అయితే ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు

కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్.. ఎన్నికలు దగ్గర పడటంతో రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని విమర్శించారు. దేశాన్ని 50 ఏళ్లకుపైగా కాంగ్రెస్‌ పాలించిందని.. అయితే ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. ఇక బీజేపీ తెలంగాణపై కుట్రలు చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని.. ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags

Next Story