ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే..ఉద్యోగాల నుండి తొలగిస్తారా: బండి

సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగాల నుండి తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. మాట తప్పిన కేసీఆర్‌ను ఏంచేయాలని నిలదీశారు. డిమాండ్ల సాధన కోసం 11 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. రెగ్యులరైజ్ చేయకుండా మళ్లీ మరో ఏడాది గడువు పెంచడం ఎంత వరకు సమంజసమన్నారు.
జేపీఎస్ లారా.. మీరేం భయపడకండని భరోసా ఇచ్చారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శలకు బీజేపీ అండగా ఉంటుందని..న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీఎం సహా మంత్రులను బయట తిరగకుండా అడ్డుకుంటామని, ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం మరో 5 నెలలే అధికారంలో ఉంటుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కారు తొలగించిన జేపీఎస్‌లందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com