మత మౌఢ్యంతోనే కొందరు సమాజానికి ఇబ్బందులు కల్గిస్తున్నారు:సీఎం కేసీఆర్

మత మౌఢ్యంతోనే కొందరు సమాజానికి ఇబ్బందులు కల్గిస్తున్నారన్నారు సీఎం కేసీఆర్. మతం, దేవుడు.. హింసకు వ్యతిరేకమన్నారు. కోకాపేట-నార్సింగి మధ్య గోష్పాద క్షేత్రంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. కరోనా కాలంలో హరేకృష్ణ హెరిటేజ్ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించిందన్న కేసీఆర్... విశ్వశాంతి కోసం అందరం ప్రార్థనలు చేయాలన్నారు. 200 కోట్లతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో 400 అడుగుల ఎత్తయిన హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌ను నిర్మిస్తుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు సాంస్కృతిక మైలురాయిగా నిలిచే ఈ టవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. శాంతిని, ఆధ్యాత్మికతను పెంపొందించే సంస్థలకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com