స్పష్టత వచ్చేవరకు సమ్మె తగ్గేదేలే అంటున్న పంచాయతీ కార్యదర్శులు

స్పష్టత వచ్చేవరకు సమ్మె తగ్గేదేలే అంటున్న పంచాయతీ కార్యదర్శులు
X
తెలంగాణ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉత్కంఠగా మారింది.తమను రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్‌తోఏప్రిల్‌ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు

తెలంగాణ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె ఉత్కంఠగా మారింది.తమను రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్‌తోఏప్రిల్‌ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సమ్మె విరమించి సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఉద్యోగాల నుంచి టర్మినేట్‌ చేస్తామని హెచ్చరించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు యూనియన్‌ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని, వెంటనే సమ్మె విరమించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు.

అయితే ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా తాము వెనుకాడబోమని, నిరవధిక సమ్మె విషయంలో తగ్గేదే లేదని జేపీఎస్‌లు, ఓపీఎస్‌లు అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలకు హాజరై మెరిట్‌ ఆధారంగా నియమితులమయ్యామని,15 వేల వేతనం,మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ నిబంధనతో.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరామని చెప్పారు.అయితే ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం రెగ్యులరైజ్‌ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.ప్రొబేషనరీ కాలాన్ని మరో ఏడాది పొడిగించిందని, ఏప్రిల్‌ 11తో ఆ గడువు కూడా పూర్తయినా ఈ అంశాన్ని పక్కన పెట్టడం వల్లే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని అంటున్నారు. మరోవైపు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించింది. వారి ఇళ్లకు వెళ్లి సంఘీభావం ప్రకటించాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.11న సంగారెడ్డి నిరుద్యోగ మార్చ్‌ ను జయప్రదం చేయాలన్నారు బండి సంజయ్‌

Tags

Next Story