Zero Shadow Day : హైదరాబాద్ లో 'నీడ పడని రోజు'

Zero Shadow Day : హైదరాబాద్ లో నీడ పడని రోజు
X

హైదరాబాద్ లో నీడలేని రోజు (Zero Shadow Day 2023) సంభవించింది. అంటే... సూర్యకిరణాలు వస్తువుపైగాని, మనుషులపైగాని పడ్డప్పుడు భూమిపై నీడ ఏర్పడుతుంది. అందుకు వ్యతిరేకంగా ఈ రోజు 12.12 గంటలకు నీడ ఏర్పడలేదు. సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సంభవించే అరుదైన ఖగోళ సంఘటన ఈరోజు ( మే 9, 2023న ) జరిగింది. మధ్యాహ్నం 12.12 గంటలకు నీడ పూర్తిగా కనిపించకుండా పోయింది. బిర్లా ప్లానిటోరియంలో ఈ విషయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

'జీరో షాడో డే' అనేది సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సంభవించే అరుదైన ఖగోళ సంఘటన. ఈ సమయంలో నిలువు వస్తువుల నీడలు నేలపై పడవు. ఈ ఘటన సంవత్సరంలో రెండు సార్లు జరుగనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది మే 9, ఆగస్టు 3వ తేదీల్లో 'జీరో షాడో డే' ఏర్పడనుంది. ఒకసారి ఉత్తరార్ధగోళంలో, మరొకటి దక్షిణార్ధగోళంలో జరుగుతుందని చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని కదలికలను అధ్యయనం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటారు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడినప్పడు ప్రజలు ఆసక్తిని కనబరుస్తారు. ఇటీవల చంద్ర గ్రహణం ఏర్పడింది. చంద్ర గ్రహణం సమయంలో, చంద్రుడు భూమి యొక్క వెలుపలి భాగంలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా చంద్రుని ఉపరితలం సూక్ష్మంగా చీకటిగా మారుతుంది.

Tags

Next Story