జూనియర్‌ పంచాయతీ తెగట్లే..!

జూనియర్‌ పంచాయతీ తెగట్లే..!
X
తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది

తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని, లేనిపక్షంలో ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా వెనక్కి తగ్గలేదు. సమ్మె విరమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అన్ని జిల్లాల కలెక్టర్లు సూచించినా స్పందించలేదు జేపీఎస్‌ల సంఘం ప్రతినిధులు క్రమబద్ధీకరణ సహా ఇతర డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెను కొనసాగించారు.

అటు హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో అమరవీరుల స్మారక స్తూపం వద్ద, అన్ని కలెక్టరేట్ల వద్ద, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. JPSల సమ్మె నిబంధనల ఉల్లంఘనేనంటూ నోటీసులిచ్చారు. వీటిని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. జేపీఎస్‌లకు నోటీసులు అందజేయాలని సూచించారు. దీంతో కలెక్టర్లు వారిని పిలిపించి, నోటీసులు తీసుకోవాలని సూచించారు. వీటిని తీసుకునేందుకు జేపీఎస్‌లు నిరాకరించారు. తమ క్రమబద్ధీకరణ జీవో వెంటనే రావాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చే దాకా తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.

జేపీఎస్‌ల సంఘం జిల్లాల నేతలతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. సమ్మె పేరిట ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోవద్దని, వెంటనే విధుల్లో చేరాలని జేపీఎస్ లను కోరారు. అయితే... ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేసారు కార్యదర్శుల సంఘం ప్రతినిధులు.

Tags

Next Story