ఉగ్ర కదలికలతో మరోసారి ఉలిక్కిపడ్డ హైదరాబాద్

ఉగ్ర కదలికలతో  మరోసారి ఉలిక్కిపడ్డ హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అరెస్ట్ చేసారు. వీరిలో హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు

హైదరాబాద్ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్ర కదలికల వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అరెస్ట్ చేసారు. వీరిలో హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్న హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్‌ అనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 11 మంది మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన వారు. కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాయి. ఉగ్ర కదలికల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో సలీమ్ హెచ్ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్‌గా పని చేస్తుండగా.. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలుగా ఉన్నారు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఇస్లాం సాహిత్యం, ఎయిర్ పిస్టల్స్, పిల్లెట్స్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 నెలల నుంచి హైదరాబాద్‌లో నిందితులు మకాం వేసినట్లుగా అనుమానిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story