తెలంగాణలో గేరు మార్చిన కాంగ్రెస్

తెలంగాణలో గేరు మార్చిన కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆపార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత గేర్ మార్చింది

తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆపార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత గేర్ మార్చింది. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పాదయాత్ర, రాజకీయ పోరాటాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్.. ఇపుడు మేనిఫెస్టోతో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈలోపు తొమ్మిది డిక్లరేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించామని.. తర్వాత ఓబీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లు ఉంటాయన్నారు. యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బిల్డింగ్స్ నిర్మించి కేసీఆర్ అభివృద్ధి అంటుంన్నాడని ఆరోపించారు. రంగు అద్దాలు, తెల్ల గోడలు అభివృద్ధికి ప్రతీకలు కాదని విమర్శించారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే హామీలు ఇస్తున్నామని తెలిపారు. సోమేశ్ కుమార్ అపాయింట్‌మెంట్‌పై కోర్టుకు వెళ్తామన్న రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వం ఉండేది 6 నెలలైతే మూడేళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రత్యేక సలహాదారుగా సోమేశ్‌కుమార్ నియామకం చెల్లదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story