టెర్రర్‌ లింక్స్‌ దర్యాప్తు ముమ్మరం

టెర్రర్‌ లింక్స్‌ దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్‌ టెర్రర్‌ లింక్స్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. కీ ఆఫ్‌ రైట్‌పాత్ పేరుతో యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు నిందితులు

హైదరాబాద్‌ టెర్రర్‌ లింక్స్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. కీ ఆఫ్‌ రైట్‌పాత్ పేరుతో యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు నిందితులు.డార్క్‌వెబ్‌,రాకెట్‌చాట్‌,తీమ్రా యాప్‌లలో ఒకరినొకరు సంప్రదింపులు జరుపుకున్నట్లు తేల్చింది NIA. కామన్‌ సోషల్‌ మీడియాకు నిందితులు దూరంగా ఉన్నారు. సలీం ఆధ్వర్యంలో టార్గెట్‌ హైదరాబాద్‌ మాడ్యుల్‌ సాగిందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

మూడు దఫాలుగా హైదరాబాద్‌ మాడ్యుల్‌ను ప్లాన్‌ చేశారని, మొదటి దఫాలో మత మార్పిడి చేయించిన రాడికల్స్..రెండో దఫాలో ఇస్లాంను నమ్మేలా స్పెషల్‌ క్లాస్‌లు, ప్రసంగాలు ఇచ్చారని మూడో దఫాలో ఆయుధాలు, ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. భోపాల్‌ నుంచి యాసిర్‌ ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్‌లో సలీం అమలు చేసినట్లు సమాచారం.హైదరాబాద్‌-భోపాల్‌ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో నిందితులు శిక్షణ తీసుకున్నట్లు తేలింది. 12 మంది భోపాల్‌ వాసులు, ఐదుగురు హైదరాబాదీ ఉన్న సంబంధాలపై ఆరా తీశారు NIA అధికారులు.. అరెస్ట్ అయిన 17 మందిలో ప్రొఫెషనల్స్‌ తో పాటు ఆటోడైవర్‌, రోజు కూలీలు ఉన్నట్లు సమాచారం.

Tags

Next Story