కొంగరకలాన్‌లో ఫాక్స్‌ కాన్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన

కొంగరకలాన్‌లో ఫాక్స్‌ కాన్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన
X
హైదరాబాద్‌ కొంగరకలాన్‌లో ఫాక్స్‌ కాన్‌ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ కొంగరకలాన్‌లో ఫాక్స్‌ కాన్‌ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్‌. కంపెనీ నిర్మాణంలో ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు . తెలంగాణను తయారీ కేంద్రంగా ఎంచుకున్నందుకు ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌ సీడ్నీలు, మరియు కంపెనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న తొమ్మిది నెలల్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందన్నారు కేటీఆర్‌. అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో, ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా ఫాక్స్‌ కాన్‌ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న, ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా అన్నారు మంత్రి కేటీఆర్. 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి, 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు మంత్రి కేటీఆర్‌.

ఈ కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన, పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టిఎస్ ఐపాస్ ద్వారా, ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుందన్నారు. తెలంగాణ దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్‌. దాదాపు 22, 700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించామన్నారు. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రానున్న 10సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం అన్నారు. ఫాక్స్‌ కాన్‌ కంపెనీ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌ రెడ్డితో పాటు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story