టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కావడం రాష్ట్రానికి సిగ్గుచేటు: వైఎస్‌ షర్మిల

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కావడం రాష్ట్రానికి సిగ్గుచేటు: వైఎస్‌ షర్మిల
అదేదో చిన్న విషయమన్నట్లు సిట్‌ను వేశారు. సిట్‌ సరిగ్గా పని చేస్తే ఐటీ శాఖ తప్పు బయట పడుతుందని వెల్లడించారు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కావడం తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. అదేదో చిన్న విషయమన్నట్లు సిట్‌ను వేశారు. సిట్‌ సరిగ్గా పని చేస్తే ఐటీ శాఖ తప్పు బయట పడుతుందని వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో అన్ని సిస్టమ్స్ ని మెయింటేన్ చేసేది ఐటి శాఖ. అయితే ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ మాత్రం నాకు ఏమి సంబంధం అంటారు..మీకు కాకా పోతే ఎవరికి సంబంధమని ఆమె వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ లే పేపర్ లీక్ కి కారణమని షర్మిల వెల్లడించారు. ఇంత మందికి భరోసాగా ఉండాల్సిన కేసీఆర్ ఒక్క సారి అయిన మాట్లాడరా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ బిడ్డలకు అస్స్యూరెన్స్‌ ఇస్తున్నట్లు పేపరు లీక్ కాకుండా, హ్యాంకింగ్ కూడా కాకుండా పరీక్ష నిర్వహిస్తామని అఫిడవిట్ లో సంతకం పెట్టాలని కోరుతున్నట్లు షర్మిల పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story