BRS : కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు భేటీ కానున్నారు. తెలంగాణ భవన్‌లో ప్రారంభం కానున్న మీటింగ్‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ,రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. తర్వాత రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 13న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 21 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై ఇవాళ జరిగే సమావేశంలో సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన తర్వాత కరీంనగర్ బహిరంగ సభ జరిగిన రోజు.. బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత అదే రోజు.. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com