TS : పెట్టుబ‌డుల‌కు తెలంగాణ ఆద‌ర్శవంతం: మంత్రి కేటీఆర్

TS : పెట్టుబ‌డుల‌కు తెలంగాణ ఆద‌ర్శవంతం: మంత్రి కేటీఆర్

తెలంగాణ ప‌రిశ్రమ‌ల విధానాలు ప్రగ‌తిశీల మార్గంలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్.. న్యూయార్క్‌లో కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ ఫోర‌మ్ సంయుక్తంగా నిర్వహించిన ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ స‌మావేశాన్ని న్యూయార్క్ సిటీతో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చ‌దువుకుని, ప‌నిచేసిన‌ట్లు చెప్పారు.

పెట్టుబ‌డుల‌కు తెలంగాణ రాష్ట్రం చాలా ఆద‌ర్శవంతంగా ఉంటుంద‌ని, ఎటువంటి వ్యాపారాన్ని అయినా మొద‌లుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ‌న‌రులు ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ప‌రిశ్రమ‌ల ఏర్పాటు విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ ప్రగ‌తిశీల ప‌థంలో వెళ్తుందన్నారు. త‌మ విధానాలు ప‌రిశ్రమ‌ల‌కు అనుకూలంగా ఉన్నాయ‌న్నారు. ఇన్నోవేష‌న్ వ్యవ‌స్థను ఉత్తేజ ప‌రిచే విధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 14 రంగాల‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంద‌ని, ఆ రంగాల‌కు విస్తృత రీతిలో అవ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక పెట్టుబ‌డిదారుల‌కు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోష‌న్ అండ్ ఎన్ఆర్ఐ అఫైర్స్ స్పెష‌ల్ సెక్రట‌రీ విష్ణు వ‌ర్ధన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

అంతకు ముందు మంత్రి కేటీఆర్‌కు యూఎస్‌, ఇండియా ప్రముఖులు స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖులతో కలిసి తాజ్ పియర్ హోటల్ నుంచి ఇండియన్ కాన్సులేట్‌ వరకు వాకింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీ కార్యకలాపాలపై ప్రశంసలు కురిపించారు. ఐడీసీ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలో 12వందల మందికి ఉద్యోగ అవకాశాలు రావడం సంతోషకరమన్నారు. ఇక తదుపరి వ్యాపారాభివృద్ధి మేరకు కార్యకలాపాల విస్తరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వారిపై ప్రశంసలు కురిపించారు మంత్రి కేటీఆర్.

Tags

Next Story