TS : బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన బీజేపీ

TS : బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన బీజేపీ


భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కోరల్లేని బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని పేర్కొంది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ (సంత్రుప్తస్థాయి) పద్దతిలో అందరికీ ఆర్దిక సాయం అందిస్తామని ప్రకటించింది.

నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని, ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో జరిగిన తెలంగాణ బీజేపీ ఓబీసీ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.


రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే... రాష్ట్రంలోని బీసీ కమిషన్ ను రాజ్యాంగ హోదా కల్పిస్తాం... బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేసి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తాం. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు స్టాచ్యురేషన్ ప్రాతిపదికన ఆర్దిక సాయం చేస్తాం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తాం. ఎన్నికల్లో గెలిచి రాలేని బీసీ కులాలకు ప్రాధాన్యతనిస్తాం.

స్వాతంత్రం వచ్చాక తొలి ప్రధానిగా చేసిన జవహార్ లాల్ నెహ్రూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే... బీసీల విషయంలో మాత్రం కమిషన్ వేసి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని అంబేద్కర్ చెప్పినా నెహ్రూ వినలేదు... బీసీ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన నెహ్రూకు నిరసనగా... అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు... అప్పుడు దిగొచ్చి కాకా కళేకర్ కమిషన్ ను నియమించింది. రెండేళ్ల తరువాత నివేదిక ఇచ్చింది. అందులో 2399 బీసీ కులాల్లో 8 వందలకుపైగా కులాలు అత్యంత వెనుకబడ్డాయని నివేదించింది. కానీ నెహ్రూ కనీసం ఆ నివేదికను బుట్టదాఖలు చేసి బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబించారు.

ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పార్లమెంట్ సాక్షిగా ఓబీసీ జాతీయ కమిషన్ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వెనుకాడకుండా ఆ బిల్లును ఆమోదింపజేసిన ఘనత నరేంద్రమోదీదే.

ప్రధానమంత్రి వికాస్ పేరిట విశ్వకర్మలను ఆదుకునేందుకు 140 జాతులకు నైపుణ్య శిక్షణనిచ్చి ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. సంచార జాతుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విద్య, ఉపాధి కల్పించారు.

ముస్లింలలో ఉన్న బీసీలకు మేం వ్యతిరేకం కాదు. ఎంబీసీల పేరుతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి రూ.2500 కోట్లు కేటాయించినా... ఖర్చు చేసింది మాత్రమే రూ.7 కోట్లే... అయినా బీసీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు బానిసలుగా ఉన్నారు? హిందూ బీసీలుగా పుట్టడమే పాపమా? బీసీ డిక్లరేషన్ ను తొక్కిపెట్టిన మహానుభావుడు కేసీఆర్.

Tags

Next Story