సీఎం కేసీఆర్‌కు బండి లేఖ.. దళిత గిరిజన భూముల్లో రియల్‌ వ్యాపారం ఆపండి

సీఎం కేసీఆర్‌కు బండి లేఖ.. దళిత గిరిజన భూముల్లో రియల్‌ వ్యాపారం ఆపండి
ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపండని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమేనని, దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని తెలిపారు.

ఇదిగో అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? అని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండ పోయిందని బండి విమర్శించారు. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించకుంటే BJP తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story