బండి సంజయ్ ను మార్చే ప్రసక్తేలేదు: కిషన్ రెడ్డి

బండి సంజయ్ ను మార్చే ప్రసక్తేలేదు: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చేస్తారన్న వార్తల్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొట్టి పారేశారు. అధ్యక్షుడిని మార్చే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. తామంతా ఒకే కుటుంబమన్నారు. తమ పార్టీ జాతీయ నేతల్ని.. రాష్ట్ర నేతలు కలవడం సహజమని చెప్పారు. ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ తమ చేతుల్లో లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అది సీబీఐ పరిధిలో ఉందన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం నడిపిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రలో ఒక వార్డ్‌ మెంబర్ గెలిచినందుకే సంబరపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.

మరోవైపు నోట్ల రద్దులో తమ ప్లాన్ తమకుందన్న కిషన్‌రెడ్డి.. రెండు వేల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. కర్నాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్న ఆయన.. తెలంగాణ బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ధీమాగా చెప్పారు. ఇక కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్‌ లేదని తేల్చి పారేశారు కిషన్‌రెడ్డి.

Next Story