మల్కంపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ట్రయల్ రన్

X
By - Vijayanand |23 May 2023 4:31 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా కోననరావుపేట మండలం మల్కంపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ట్రయల్ రన్ నిర్వహించారు. ప్యాకేజీ-9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీల సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ… పంపు హౌస్‌లో మోటర్లను ప్రారంభించి.. గోదావరి జలాలను మల్కపేట జలాశయంలోకి ఎత్తిపోశారు. రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు.. 26 వేల 150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మల్కపేటలో 504 కోట్లతో నిర్మించిన ఈ రిజర్వాయర్ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com