జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభ

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సభకు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్, ఏఐసీసీ నేతలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. పీపుల్స్ మార్చ్ బహిరంగ సభా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుద్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సుమారు 50 వేల మంది హాజరవుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అటు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జడ్చర్ల నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. అటు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు రేవంత్‌రెడ్డితో పాటు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com