Hyderabad: మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి

Hyderabad: మూడేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి
X

హైదరాబాద్‌ పాతబస్తీలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలోని DRDO సమీపంలో మూడేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. DRDO టౌన్‌షిప్ C టై.ప్ క్వార్టర్‌లో బాలుడి ఇళ్లు ఉంది. రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా ఐదు కుక్కలు దాడి చేశాయి. ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మళ్లీ దాడులు పునరావృతం అవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు.

Tags

Next Story