ఉద్యమంలో పోరాడితే విలువ తెలిసేది.. రేవంత్, బండిలపై మంత్రి జగదీష్ పైర్

ఉద్యమంలో పోరాడితే విలువ తెలిసేది.. రేవంత్, బండిలపై మంత్రి జగదీష్ పైర్

రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ చీఫ్ లపై విరుచుకుపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. టీవీ 5తో మాట్లాడిన ఆయన... తెలంగాణ ఉద్యమంలో కనిపించని నాయకులు.. కాంగ్రెస్, బిజెపి పార్టీల అధ్యక్షులు కావడం మన కర్మఅని అన్నారు. ఉద్యమంలో పోరాడితే ఆ విలువ తెలిసేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ మీద పదవులు మీద మొహం తప్పితే.. తెలంగాణ మీద ప్రేమ లేదని అన్నారు. ఆనాడు తెలంగాణ వ్యతిరేకుల చేతిలో ఉన్న రేవంత్.. నేడు జాతీయ పార్టీ చేతుల్లో ఉన్నారుని ఎద్దేవాచేశారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు చేయాల్సిన పార్టీలు, రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు.. 111 జీవో మీద రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ బిజెపిల పరిస్థితి ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉందని చెప్పారు.

Next Story