కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలిసిన షర్మిల

కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కలిసిన షర్మిల
X

కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. తనతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కూడగట్టుకుని రాబోయే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు జతగా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసివెళ్లేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా షర్మిల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశారు. వీరి భేటీతో తెలంగాణలో కాంగ్రెస్, టీవైఎస్ఆర్సీపీ కలిసి పోటీచేయనున్నట్లు విశ్లషకులు భావిస్తున్నారు.

Next Story