Hyderabad : పౌరుల జీవన నాణ్యతలో హైదరాబాద్ కు 19వ ర్యాంక్

నగరాల్లోని పౌరుల జీవన నాణ్యతపై గృహ నిర్మాణ, పట్టణాభిృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'సిటిజన్ పర్సెప్షన్ సర్వే'లో హైదరాబాద్ వెనుకంజలో ఉంది. దేశంలోని అన్ని నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా హైదరాబాద్ 19వ స్థానంలో నిలిచింది.
తెలంగాణలోని నగరాల్లో రాజధాని 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని వరంగల్ కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో కరీంనగర్ నిలిచింది. ఈ సర్వేపై అవగాహన లేకపోవడంతో హైదరాబాద్‌లో కేవలం 24013 మంది పౌరులు మాత్రమే పాల్గొన్నారు. వరంగల్‌లో 96000 మందిపాల్గోనగా కరీంనగర్‌లో 79000 మంది పాల్గోన్నారు. అందుకే హైదరాబాద్ వెనుక పడిందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవలపై పౌరుల అభిప్రాయాలను నమోదు చేసే సర్వే వివరాలను ప్రచారం చేసినా ఎవరూ దీనిపై ఆసక్తి చూపలేదు. దీంతో హైదరాబాద్ ర్యాంక్ పడిపోయిందని తెలుస్తోంది. హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని ఏ నగరమూ టాప్ 10 ర్యాంక్‌లో నిలువ లేదు. మొదట స్థానంలో థానే నగరం నిలువగా, ఐటీ హబ్ బెంగళూరు రెండవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు 6వ స్థానంలో నిలవగా, 8,9వ స్థానాలను విజయవాడ, విశాఖపట్నం దక్కించుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com