టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహాం..ఏ2 రాజశేఖర్ బీజేపీనే
ఏ2 రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నిందితుల్లోని ఏ2 రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలతో రాజశేఖర్ దిగిన ఫోటొలు జతచేశారు. దీంతో కేటీఆర్ ట్వీట్‌కు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాజశేఖర్‌ను అపాయింట్ చేసింది టీఎస్‌పీఎస్ చైర్మెన్ జగన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎదురు దాడికి దిగారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ బీజేపీ సపోర్టర్‌గా బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఓట్ ఫర్ బీజేపీ అంటూ తను గతంలో చేసిన సామాజిక మాధ్యమాల పోస్టులను బయటికి తీసుకు వస్తున్నారు. పలువురు బీజేపీ నేతలతో దిగిన ఫోటొలను కూడా బయట పెడుతున్నారు. ప్రభుత్వంపై కుట్రతోనే బీజేపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతుందని ఆరోపిస్తున్నారు.