తెలంగాణలో మెడ్ ట్రానిక్ 3 వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్ ట్రానిక్ కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో... కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. మెడ్ ట్రానిక్ నిర్ణయాన్ని స్వాగతించారు మంత్రి కేటీఆర్. వైద్య పరికరాల తయారీ, అభివృద్ధి రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బహుళ జాతి కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన బహుళజాతి కంపెనీల గురించి వివరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com