బీఆర్ఎస్ లోని చీడపురుగులను కేసీఆర్ ఏరివేస్తారు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీలో అక్కడక్కడ కొన్ని కొండెంగలు, చీడపురుగులు ఉన్నాయని వాటి కాళ్లు చేతులు పార్టీ విరిచేస్తానని సీఎం చెప్పారని అన్నారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ తన పనితీరు బాగుందంటూ ప్రశంసించారని, బాగా పని చేసుకొమ్మని దీవించారని అన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయం చేస్తెనో, తెల్ల బట్టలు వేసి మందు తాగితేనో ప్రజాక్షేత్రంలో నడవదుని, ప్రజల మధ్యలో తిరిగి ప్రజల పక్షాన నిలబడినవాళ్ళనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు.
జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని భూస్థాపితం చేసి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిలబెట్టి 34 వేల మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓళ్ళో వేశామని,నీచమైన రండ రాజకీయాలు చేసిన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సపోర్ట్ చేయరని అన్నారు. ముత్తిరెడ్డి ప్రజా క్షేత్రంలోనే ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర రిపోర్ట్ ఉందని అన్నారు. మంత్రులందరి ముందే యాదన్న నీకు ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉందని ,మరింత మెరుగుపరచుకోమని, ఎక్కడో ఉన్న నియోజకవర్గాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నాం, ముందుకుపో అని స్వయంగా సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. పార్టీలో అక్కడక్కడ మోపైన కోతులు, కొండెంగల మెడలను వంచేస్తాయని సీఎం కెసిఆర్ అన్నారని,ఎమ్మెల్యేను కాదని ఎవరు ఏమి చేయడానికి లేదని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com