నాకు 50ఏళ్ల అనుభవం ఉంది..ఎన్నో ఆటుపోట్లు చూశా: సీఎం కేసీఆర్‌

నాకు 50ఏళ్ల అనుభవం ఉంది..ఎన్నో ఆటుపోట్లు చూశా: సీఎం కేసీఆర్‌
తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర రైతు సంఘాలతో భేటీ

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర రైతు సంఘాలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన రైతు సంఘాల నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. రైతు సంఘాల నేత శరద్‌ జోషిని సీఎం కేసీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఆయనకు రాజకీయంగా 50 ఏళ్ల అనుభవం ఉందని, ఎన్నో ఆటుపోట్లు చూశానన్నారు. రైతుల సమస్యలు నేను తలకెత్తుకున్నానన్న కేసీఆర్‌ అసంభవం అనేదే ఉండదని వెల్లడించారు. మన ఆలోచనల్లో నిజాయితీ ఉండాలే కానీ కచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. కాకపోతే కాస్త ఓపిక పట్టాలని పేర్కొన్నారు. ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుందన్నారు.

రైతుల కోసం సర్‌ చోటూరామ్‌ దేశంలో తొలిసారి నినదించారు, అన్నధాతల కోసం గతంలో చాలా మంది పోరాటం చేశారన్నారు. చౌదరి చరణ్‌ సింగ్‌, దేవీలాల్‌ వంటి వారు ప్రయత్నించారని తెలిపారు. నమ్మడం అంటే చుడటమేనని, ఒకసారి తెలంగాణ మొత్తం తిరిగి చూసి రావాలని మహారాష్ట్ర ప్రతినిధులను సీఎం కేసీఆర్‌ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలని సూచించారు. ఢిల్లీలో రైతులు 13 నెలల పాటు ధర్నా చేశారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోగా ధర్నా చేస్తున్న రైతులను ఉగ్రవాదులని ప్రభుత్వం వెల్లడించింది. అయినా రైతులు ఏమాత్రం చెక్కు చెదరకుండా పోరాటం చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపనలు చెప్పారని వెల్లడించారు. ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరులయ్యారని గుర్తుచేశారు. వారి కోసం ప్రధానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story