కరీంనగర్‌ జైల్‌లో బండి..7917 నెంబర్‌ కేటాయింపు

కరీంనగర్‌ జైల్‌లో బండి..7917 నెంబర్‌ కేటాయింపు
X

టెన్త్‌ హిందీ పేపర్‌ లీక్‌ కుట్ర కేసులో హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించడంతో.. బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలుకు తరలించారు. సంజయ్‌ను జైలులోని గోదావరి బ్యారక్‌లో ఉంచారు. ఆయనకు 7917 నెంబర్‌ను జైలు అధికారులు కేటాయించారు. అటు జైలుకు వచ్చిన కుటుంబ సభ్యులు సంజయ్‌ ములాఖత్ కోరనున్నారు. మరోవైపు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. బీజేపీ శ్రేణులు భారీగా చేరుకుంటుండడంతో కరీంనగర్‌ జిల్లా ఖారాగారం వద్ద పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

Tags

Next Story