BRS : నాందేడ్‌లో బీఆర్‌ఎస్ భహిరంగ సభ

బీఆర్ఎస్ పార్టీ నాందేడ్‌లో ఆదివారం భారీ బహిరంగ నిర్వహిస్తోంది. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి బారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. సభ కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి 1.30గంటలకు సభాస్థలికి చేరుకోనున్నారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాతా 2.30గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటి ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు. భోజనానంతరం 4గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. సాయంత్రం ఐదుగంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com