Medico preethi : విషమంగానే మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి

Medico preethi : విషమంగానే  మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి
ప్రీతిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న నిమ్స్‌ వైద్యుల బృందం

మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగానే ఉంది. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసి ఐదు రోజులైనా ఇప్పటికే ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఇంకా వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మో సపోర్టుతోనే చికిత్స అందిస్తున్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో నిమ్స్‌లో వైద్యం కొనసాగుతుంది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్‌ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుంది. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా బ్రెయిన్‌ పై మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడుతుందన్నారు. ఇక కూతురు పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురుని రక్షించాలని వైద్యులను వేడుకుంటున్నారు. ఆత్మహత్యకు ముందు ప్రీతి తన తల్లికి ఫోన్‌ చేసి సైఫ్‌ వేధింపుల గురించి చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కేసు నమోదు చేసింది. అటు ఈ కేసులో ఎంజీఎం విధుల నుంచి సైఫ్‌ను సస్పెన్షన్‌ చేశారు. మెడికల్‌ లీగల్‌ కేసుగా పరిణగిస్తున్న చర్యలు తీసుకున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ వెల్లడించారు. వేధింపులు రుజువై శిక్షపడితే.. సైఫ్‌ను కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గిరిజన, ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story