నల్గొండ సర్కార్ దవాఖాన నిర్వాకం.. బాత్‌రూంలోనే ప్రసవం

X
By - Subba Reddy |30 March 2023 8:30 AM IST
రెండవ కాన్పు కోసం ఓ మహిళ ఆస్పత్రికి వచ్చింది.ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవించడానికి వారం రోజులు పడుతుందన్నారు
నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుషం జరిగింది. రెండవ కాన్పు కోసం ఓ మహిళ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రసవించడానికి వారం రోజులు పడుతుందన్నారు. ఈ క్రమంలోనే బుధవారం గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలోని బాత్‌రూంలోకి వెళ్లగా పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని కుంటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక శిశువును ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com